యానాం ఎర్రగుంట వారి వీధిలో తిరుకోటి చిరంజీవి కుటుంబం అద్దెకు ఉంటుంది. చిరంజీవి కుమార్తె ఐదేళ్ల కావ్య శ్రీ సోమవారం ఆరుగంటల సమయంలో ఇంటి ఎదుట ఆడుకుంటోంది. పది రోజుల క్రితం పక్క వీధిలో అద్దెకి వచ్చిన నాగలక్ష్మి మాయమాటలు చెప్పి పాపను తీసుకుపోయింది. కాసేపటి తర్వాత తల్లిదండ్రులు బాలిక కనిపించకపోవడాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ శివ గణేష్ ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలింపు చర్యలు చేపట్టగా.. మంగళవారం ఉదయం పక్క వీధిలో నాగలక్ష్మి కనిపించకపోవడం గుర్తించారు.
బాలికను అపహరించారు.. రూ.30 వేలకు అమ్మేశారు
కేంద్రపాలిత యానాంలో సోమవారం సాయంత్రం అపహరణకు గురైన ఐదేళ్ల బాలికను 15 గంటల్లో పోలీసులు గుర్తించి.. తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. ఈ ఘటనలో ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. అపహరించిన వ్యక్తి.. బాలికను వేరేవాళ్లకు దత్తత ఇచ్చాడు.
నాగలక్ష్మి వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలికను నాగలక్ష్మి తన స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా బ్రహ్మపురి గ్రామంలోని బంధువైన నాటి వెంకటేశ్వర్లకు రూ.30 వేలకు అమ్మినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. నాగలక్ష్మి, వెంకటేశ్వర్లు కలిసి దేవీపట్నం మండలానికి చెందిన దంపతులకు దత్తత ఇచ్చినట్లు చెప్పారు. నిందితులను తీసుకొని దేవిపట్నం వెళ్లి బాలికను గుర్తించారు. యానాం తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులు నాగలక్ష్మి, వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. దత్తత తీసుకున్న కుటుంబంపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ భక్తవత్సలం తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్రవ్యాప్తంగా 'భారత్ బంద్'కు భారీ స్పందన