తూర్పు గోదావరి జిల్లా మండపేట పెద్దకాలువలో ఇద్దరు పిల్లలు స్నానానికి దిగారు. ప్రమాదం ఎదురవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఆరో తరగతి చదువుతున్న సంధ్య నీటిలో గల్లంతైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక గల్లంతు కావడంతో కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది.
పెద్దకాలువలో ప్రమాదం... బాలిక గల్లంతు! - girl fell in the canal
ఇద్దరు బాలికలు స్నానానికి కాలువలోకి దిగారు. ప్రమాదవశాత్తు అందులో ఇరుక్కున్నారు. ఒకరు సురక్షితంగా బయట పడగా... ఇంకొకరు మాత్రం గల్లంతయ్యారు. ఈ ఘటన మండపేటలోని పెద్దకాలువలో చోటుచేసుకుంది.
girl fell in the canal at mandapeta,