తూర్పుగోదావరి జిల్లా మన్యంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రంపచోడవరంలో జీసీసీ, పౌరసరఫరాల శాఖకు చెందిన మూడు గోదాములు నీట మునిగాయి. గోదాముల్లో నిల్వ ఉంచిన బియ్యం, పంచదార, కందిపప్పు, ఉప్పు, కారం, పసుపు తదితర నిత్యావసర సరకులు తడచిపోయి పాడయ్యాయి. దీంతో రూ.5 లక్షల నష్టం వాటిల్లినట్టు గిరిజన సహకార సంస్థ(జీసీసీ) డివిజనల్ మేనేజర్ జగన్నాధ రెడ్డి తెలిపారు. జరిగిన నష్టాన్ని డీఎంతో పాటు మండల సివిల్ సప్లై అధికారి సూర్యారావు, జీసీసీ మేనేజర్ రెడ్డి, వీఆర్వో విజయకుమారి పరిశీలించి అంచనా వేశారు. ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్యకు నివేదించినట్లు జగన్నాధ రెడ్డి తెలిపారు.
భారీ వర్షానికి నీటమునిగిన జీసీసీ గోదాములు- తడిచిన నిత్యావసరాలు - భారీ వర్షానికి నీటమునిగిన జీసీసీ గోదాములు- తడిచిన నిత్యావసరాలు
తూర్పుగోదావరి జిల్లా మన్యంలో శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో రంపచోడవరంలో జీసీసీ, పౌరసరఫరాల శాఖకు చెందిన మూడు గోదాములు నీట మునిగాయి. వాటిలో నిల్వ ఉంచిన నిత్యావసరాలు తడిచి పాడయ్యాయి.
భారీ వర్షానికి నీటమునిగిన జీసీసీ గోదాములు- తడిచిన నిత్యావసరాలు