పదేళ్లుగా జీతాలు ఇవ్వకున్నా.... వినియోగదారులిచ్చే టిప్పులపైనే ఆధారపడిన గ్యాస్ కార్మికులకు న్యాయం చేయాలని తూర్పుగోదావరి జిల్లా గ్యాస్ డెలివరీ వర్కర్స్ సంఘం కోరింది. ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు. ద్రాక్షారామంలోని ఓ గ్యాస్ యాజమాన్యం 8 మంది కార్మికులను అక్రమంగా తొలగించిందని పేర్కొన్నారు. కార్మిక శాఖ అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వరరావు ఆరోపించారు. జీతాలు అడిగితే కార్మికులను తొలగించడం సరికాదన్నారు. ఫిర్యాదులను పట్టించుకోని కార్మిక శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాకినాడ కలెక్టరేట్ వద్ద వద్ద గ్యాస్ డెలివరీ వర్కర్స్ సంఘం నిరసన - kakinada latest news
కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద గ్యాస్ డెలివరీ వర్కర్స్ సంఘం నిరసన కార్యక్రమం చేపట్టింది. ఐఎఫ్టీయీ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కార్మిక శాఖ అధికారులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని వాపోయారు.
![కాకినాడ కలెక్టరేట్ వద్ద వద్ద గ్యాస్ డెలివరీ వర్కర్స్ సంఘం నిరసన gas delivery workers association protest at kakinada to give their payments](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8062606-1012-8062606-1594991395089.jpg)
కలెక్టర్ కార్యాలయం వద్ద గ్యాస్ డెలివరీ వర్కర్స్ సంఘం నిరసన