తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి వద్ద పోలీసులు చేపట్టిన వాహన తనఖీల్లో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. లారీ కంటైనర్లో రూ. 44 లక్షల విలువైన గంజాయిని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 42 సంచుల్లో 1470 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చింతూరు సీఐ యువకుమార్ తెలిపారు.
లారీ కంటైనర్లో 1470 కేజీల గంజాయి తరలింపు.. పట్టివేత - cannabis caught in east godavari
డొంకరాయి వద్ద లారీ కంటైనర్లో తరలిస్తున్న 1470 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను చింతూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వీటి విలువ రూ. 44 లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు.

రూ. 44 లక్షల సరుకు స్వాధీనం