రావులపాలెంలో 460 కేజీల గంజాయి పట్టివేత - police
పోలీసుల తనిఖీల్లో 460 కేజీల గంజాయి పట్టుబడింది. ఏడుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2 వాహనాలు, 10 చరవాణులు, రూ.38 వేలు స్వాధీనం చేసుకున్నారు.
తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో 460 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు విశాఖ జిల్లా పాడేరు అటవీ ప్రాంతం నుంచి గంజాయి ప్యాకెట్లను తరలిస్తుండగా.... పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు వ్యక్తులు, రెండు వాహనాలతోపాటు 10 చరవాణులు, 38 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తమిళనాడుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు పంపుతున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ. 46 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.