తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలంలోని నెల్లిపాక శివారు పోలీసు చెక్‌పోస్టు సమీపంలో మినీ లారీ కాలువలోకి దూసుకుపోవడాన్ని స్థానికులు గుర్తించారు. అందులోని కొబ్బరి బొండాల నుంచి గంజాయి వాసన రావడంతో పోలీసులకు తెలిపారు. ఎస్సై జ్వాలాసాగర్ ఆధ్వర్యంలో సిబ్బంది పరిశీలించి బొండాల్లో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. వాహనం వద్ద ఎవరూ లేకపోవడంతో సరకు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నామన్నారు.
కాలువలోకి దూసుకెళ్లిన లారీ.. గుప్పుమన్న బొండాలు - గంజాయి వార్తలు
కొబ్బరిబొండాల్లో తరలిస్తున్న గంజాయి తూర్పుగోదావరిలో పట్టుబడింది. నిందితులు వాహనాన్ని వదలి పరారవ్వడంతో.. అవి ఎక్కడినుంచి వచ్చాయనే విషయంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ganja caught