తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో ప్రసిద్ధి చెందిన గండి పోశమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. ఆలయ ప్రత్యేక అధికారి అల్లాడి సత్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ ఛైర్మన్ అనంత బాబు హాజరయ్యారు. ఆలయ ఛైర్మన్గా కట్టా సత్యనారాయణ, సభ్యులుగా సోదే రామాయమ్మ, మానం సుబ్బారావు, పసుపులేటి పద్మ, గంగల గంగన్నదొర, తెల్లం రామలక్ష్మి, బదిరెడ్డి వీర నరసయ్య, పడాల సుగుణ కుమారి, సోదే బాబురావు ప్రమాణ స్వీకారం చేశారు.
గండి పోశమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల, మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం - మ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గండి పోశమ్మ తల్లి ఆలయ నూతన ధర్మకర్తలు, మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు.
గండి పోశమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల, మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం