ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోనసీమలో రహదారులకు మహర్దశ.. నిధులు మంజూరు - తూర్పు గోదావరి జిల్లా కోనసీమ తాజా వార్తలు

రహదారుల అభివృద్ధికి తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో పెద్ద మొత్తంలో నిధులు మంజురయ్యాయి. ఫలితంగా టెండర్ల ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు ఆర్​ అండ్ బీ శాఖ వెల్లడించింది.

'కోనసీమలో రహదారులకు మహర్దశ : నిధులు మంజూరు'
'కోనసీమలో రహదారులకు మహర్దశ : నిధులు మంజూరు'

By

Published : Nov 10, 2020, 10:21 PM IST

తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో రోడ్లు భవనాల శాఖకు సంబంధించి వివిధ రహదారుల అభివృద్ధికి రూ.48.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. 5 రహదారులను అభివృద్ధి చేసేందుకు సెంట్రల్ రోడ్ ఫండ్స్ (సీఆర్ఎఫ్ ) రూ.48.50 కోట్లు మంజూరు చేసినట్లు ఏఈఈ రాజేందర్ వెల్లడించారు. రాజవరం పొదలాడ రహదారిని గంటి నుంచి పి.గన్నవరం వరకు అభివృద్ధి చేసేందుకు రూ 24.50 కోట్లను అంచనా వేస్తూ నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.

'కోనసీమలో రహదారులకు మహర్దశ : నిధులు మంజూరు'

ప్యాకేజీ కింద నిర్మించేందుకు రూ.23 కోట్లు..

మామిడికుదురు మండలంలోని కొండాలమ్మ చింత నుంచి అప్పనపల్లి వరకు పెదపట్నం అంబాజీపేట మండలం గంగలకుర్రు రహదారికి ప్యాకేజీ కింద చేర్చి నిర్మించేందుకు రూ.23 కోట్లు మంజూరైనట్లు పేర్కొన్నారు. అమలాపురం బొబ్బర్లంక రహదారికి మరమ్మతుల నిమిత్తం రూ.కోటి నిధులు మంజూరు చేసినట్లు రాజేందర్ స్పష్టం చేశారు. మరమ్మతులకు టెండర్ ప్రక్రియ సైతం ఖరారైందనని వివరించారు.

'కోనసీమలో రహదారులకు మహర్దశ : నిధులు మంజూరు'

టెండర్లకు చర్యలు..

రహదారులకు సంబంధించి టెండర్లు పిలిచేందుకు చర్యలు చేపట్టినట్లు ఏఈఈ జి. రాజేంద్ర చెప్పారు. ఆయా రహదారులు గుంతలు పడి అధ్వానంగా మారడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిధులు మంజూరైన నేపథ్యంలో టెండర్లు ఖరారై పనులు వెంటనే మొదలు పెడితే వాహన చోదకులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

ఇవీ చూడండి : ఎంత ఖరీదైన వైద్యమైనా ఆరోగ్యశ్రీ వర్తించాలి: సీఎం జగన్

ABOUT THE AUTHOR

...view details