పేద మహిళలు ఆర్థికంగా పైకి రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతోందని.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. జిల్లాలోని ఆత్రేయపురం మండలం మహిళా సమాఖ్య కార్యాలయంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని.. ఆయన ప్రారంభించారు. కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం 6315 గ్రూపులలో ఉన్న 63,150 మంది మహిళలకు..రూ. 3కోట్ల 97 లక్షలను సున్నా వడ్డీ కింద నిధులను విడుదల చేశామని తెలిపారు. అంతేకాకుండా మహిళల ఆర్థిక స్వావలంబన, పిల్లల చదువుల కోసం అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపునేస్తం, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పధకాలను అమలు చేస్తూ.. దేశంలోనే, రాష్ట్రం సంక్షేమ పధకాల అమలులో అగ్రగామిగా ఉందని తెలిపారు.ఈ పథకాలను ఉపయోగించుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు.
ఆత్రేయపురంలో సున్నా వడ్డీ పథకం ప్రారంభం - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
మహిళలు ఆర్థికంగా బలపడాలనే లక్ష్యంతో.. ప్రభుత్వం సున్నావడ్డీ పథకాన్ని ప్రారంభించిందని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తెలిపారు. జిల్లాలోని ఆత్రేయపురం మండలం మహిళా సమాఖ్య కార్యాలయంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని..ఆయన ప్రారంభించారు.
sunna vaddi pathakam
ఇదీ చదవండి:మంగళగిరి ఎయిమ్స్‌లో టెలి మెడిసిన్ సేవలు