దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో... రోడ్డుపై నివసించే యాచకులు, నిరాశ్రయులకు ఇబ్బందులు తప్పటం లేదు. నిరాశ్రయుల ఆకలి తీర్చేందుకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో శ్రీకృష్ణదేవరాయ కల్యాణ మండపంలో ఉచిత భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సత్తిదొర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమానికి నిరాశ్రయులు బారులు తీరారు.
నిరాశ్రయుల ఆకలి తీర్చిన మనసున్న దాత - రావులపాలెంలో లాక్డౌన్
నిరాశ్రయుల ఆకలి తీర్చేందుకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ఓ దాత ముందుకు వచ్చారు. సుమారు 200 మందికి ఉచితంగా భోజనాలు పెట్టించారు రావులపాలెంకు చెందిన సత్తిదొర రెడ్డి.
రావులపాలెంలో ఉచిత భోజన కార్యక్రమం