అన్నవరం కొండపై ఉచిత కల్యాణ మండపం అన్నవరం దేవస్థానం కొండపై వివాహం చేసుకునే సామాన్య భక్తులకు ఉచిత కళ్యాణ మండపాన్ని నిర్మించారు విశాఖకు చెందిన ఓ దాత. విశాఖపట్నానికి చెందిన మాజీ ధర్మకర్తల మండలి సభ్యుడు మారెడ్డి సింగారెడ్డి, అంజని దంపతులు కొండపై వివాహం చేసుకునే సామాన్య భక్తులకు పూర్తి స్థాయి వసతులతో సౌకర్యవంతంగా ఉచిత కళ్యాణ మండపం నిర్మించారు. ఇందులో ఒకేసారి 15 నుంచి 20 జంటలు వివాహాలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. వధూవరులకు ప్రత్యేక గదులు, స్నానపు గదులు, ఆర్వో ప్లాంట్ నిర్మించారు. కళ్యాణ మండపాన్ని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్ల చేతులు మీదుగా ప్రారంభించారు.
ఇదీ చదవండి: