ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తూర్పుగోదావరి జిల్లాలో ఉచిత గ్యాస్ - corona in East Godavari district

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ విధించడంతో మూడు నెలలపాటు పేదలకు ఉజ్వల పథకంలో గ్యాస్ ను ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలు ప్రజలకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. అంతేగాక విద్యుత్​ వినియోగదారులు మార్చి నెలలో చెల్లించిన మొత్తాన్నే ఏప్రిల్ నెలలో కూడా చెల్లించాలని తునిలోని అధికారులు ప్రచారం చేస్తున్నారు.

Free gas in East Godavari district
తూర్పుగోదావరి జిల్లాలో ఉచితగ్యాస్

By

Published : Apr 8, 2020, 6:56 PM IST

కేంద్ర ప్రభుత్వం లాక్​డౌన్ విధించడంతో మూడు నెలలపాటు పేదలకు ఉజ్వల పథకంలో గ్యాస్ ను ఉచితంగా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఇండేన్ గ్యాస్ ఏజెన్సీలు ప్రజలకు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంది. జిల్లావ్యాప్తంగా 20,150 మంది ఇండేన్ గ్యాస్ లబ్ధిదారులు ఉన్నారని... రాళ్లపాలెం రాహుల్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుడు కొవ్వూరు వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వారి బ్యాంకు ఖాతాల్లో సొమ్ములు జమ చేసిందని ఆయన అన్నారు. మే, జూన్ నెలకు సంబంధించి అప్పటి ధరల ప్రకారం ఖాతాల్లో జమ చేస్తుందన్నారు. లబ్ధిదారులు ఈ సొమ్మును బ్యాంకు ఖాతా నుంచి తీసుకుని గ్యాస్ ఏజెన్సీలకు చెల్లించి గ్యాస్ సిలిండర్లను పొందాలన్నారు.

విద్యుత్​ వినియోగదారులు మార్చి నెలలో చెల్లించిన మొత్తాన్నే ఏప్రిల్ నెలలో కూడా చెల్లించాలని జిల్లాలోని తుని విద్యుత్​శాఖ అధికారులు ప్రచారం చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ నెల విద్యుత్తు రీడింగ్ తీసుకోమని...మార్చి నెలలో చెల్లించిన నగదునే....ఏప్రిల్​లో కూడా అంతే చెల్లించాలని కోరారు. తేడాలుంటే తర్వాత బిల్లులో సరిచేస్తామని అధికారులు తెలియజేస్తున్నారు. బిల్లులు చెల్లించే సమయంలో భౌతిక దూరం పాటించాలని కోరారు.

ఇదీచూడండి.'ఇంటింటి సర్వే చేయండి.. బాధితులను గుర్తించండి'

ABOUT THE AUTHOR

...view details