ప్రముఖ చమురు సంస్థ ఓఎన్జీసీ సామాజిక భద్రత, సహకారం కార్యక్రమంలో భాగంగా... కేంద్రపాలిత యానాంలో ఉచిత కంటివైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ కంటి ఆసుపత్రి సిబ్బంది పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉచిత శిబిరానికి కంటి సమస్యలతో బాధపడుతున్న వారు అధిక సంఖ్యలో వచ్చారు. ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారందరికీ స్థానిక లయన్స్ క్లబ్ సభ్యులు సహకారం అందించారు.
ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం - యానాంలో ఓఎన్జీసీ ఉచిత కంటి పరీక్ష శిబిరం
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ప్రముఖ చమురు సంస్థ ఓఎన్జీసీ ఉచిత కంటి పరీక్ష శిబిరం ఏర్పాటు చేసింది. నేత్రసమస్య సాధరణంగా ఉన్నవారికి మందులు.. కళ్ళజోళ్లు ఉచితంగా అందజేశారు. శస్త్ర చికిత్స అవసరమైనవారిని ప్రధాన ఆసుపత్రికి పంపిస్తున్నారు.
ఉచిత కంటి పరీక్ష శిబిరం