కాకినాడ బాలికల పాఠశాలలో పుస్తకాల పంపిణీ - జిల్లా కలెక్టర్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ బాలికల పాఠశాలలో సోము దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మురళీధర్ రెడ్డి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
![కాకినాడ బాలికల పాఠశాలలో పుస్తకాల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3850534-946-3850534-1563269546526.jpg)
పుస్తకాల పంపిణీ
సేవా కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని కలెక్టర్ మురళీధర్ రెడ్డి తెలిపారు. పుస్తకాల పంపిణీ అనంతరం ఆయన మాట్లాడారు. సోము దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కొనియాడారు. ఇటువంటి వారిని స్పూర్తిగా తీసుకుని... మిగిలిన వారు సైతం సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు.
పుస్తకాల పంపిణీ కార్యక్రమం