కొవిడ్ రోగులకు ఉచిత ఆంబులెన్స్ సర్వీస్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం శాసనసభ్యుడు కొండేటి చిట్టిబాబు అన్నారు. కరోనా బాధితుల సహాయార్థం టీం గరుడవేగ ఫౌండేషన్ సమకూర్చిన ఉచిత అంబులెన్స్‌ను పోతవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా టీం గరుడవేగ ఫౌండేషన్ సభ్యులను ఎమ్మెల్యే చిట్టిబాబు అభినందించారు.
పోతవరంలో కొవిడ్ రోగుల కోసం ఫ్రీ అంబులెన్స్ సర్వీసు - పోతవరంలో కోవిడ్
కొవిడ్ బాధితుల కోసం స్వచ్ఛంద సంస్థలు పలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పోతవరంలో టీం గరుడవేగ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు.

కోవిడ్ రోగుల కోసం పోతవరంలో ఫ్రీ అంబులెన్స్ సర్వీసు