కాకినాడ గ్రామీణంలోని వలకపాకలకు చెందిన నాగప్రసాద్‌కు కరణంగారి జంక్షన్‌కు చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. మాటల్లో స్నేహితుల ద్వారా తనకొక వీడియో వచ్చిందని నాగప్రసాద్‌కు సుబ్రమణ్యం చూపించాడు. కంటి నిండా కరెన్సీ కట్టలు కనిపించాయి అందులో…అంతే ఆశగా వీడియో వివరాల గురించి అడిగాడు నాగరాజు.
ఆ ఏం లేదు…నాకు తెలిసిన ఓ ముఠా విశాఖలో నోట్ల మార్పిడి చేస్తోంది. వారి వద్ద 200 కోట్ల రూపాయలు 2వేల నోట్ల కట్టలు ఉన్నాయట..మనం కొంత మొత్తంలో రూ.500 నోట్లు ఇస్తే, దానికి కొంత కమీషన్ కలిపి మనకి 2వేల నోట్లు ఇస్తారట…సులభంగా డబ్బు సంపాదించవచ్చు..బాగుంది కదూ కమీషన్ బిజినెస్ అంటూ సుబ్రమణ్యం నాగప్రసాద్‌కు వివరించాడు. నాగప్రసాద్‌కు కూడా ఇదేదో బాగుందే అనిపించింది. ముఠా వివరాలు తెలుకుని వెంటనే విశాఖకు బయలుదేరి వారిని కలిశాడు. వచ్చిన పనేంటో చెప్పాడు.