ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

FRAUD: చిట్టీల వ్యాపారి మోసం.. ఐపీ పెట్టి రూ. 5 కోట్లు టోకరా - east godavari district news

తూర్పు గోదావరి జిల్లా కె. గంగవరంలో చిట్టీల వ్యాపారి మోసం వెలుగులోకి వచ్చింది. తమ చిట్టీల సొమ్ము ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

FRAUD
FRAUD

By

Published : Nov 7, 2021, 11:00 PM IST



తూర్పు గోదావరి జిల్లా కె. గంగవరంలో ఘరానా మోసం వెలుగు చూసింది. కర్రి వీరాంజనేయ భైరవస్వామి (అంజి) అనే చిట్టీల నిర్వాహకుడు చిన్నచిన్న వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలతో చిట్టీలు కట్టించుకుని 200 మందిని మోసం చేశాడు. వారికి రూ. 5 కోట్ల మేర టోకరా వేసి మోసం చేశాడు. చిట్టీల నిర్వాహకుడు ముందస్తు చర్యల్లో భాగంగా తనకు ప్రాణహాని ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. దీంతో చిట్టీ కట్టిన బాధితులు ఏం చేయాలో తెలియక లబోదిబోమంటున్నారు. 116 మంది చిట్టీ బాధితులకు ఐపీ నోటీసులను నిందితుడు ఇప్పటికే జారీ చేశాడు. ఈ విషయంపై అధికారులు స్పందించి నిర్వాహకుడిపై చర్యలు తీసుకొని న్యాయం చేసి.. అతనిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. తమ చిట్టీల సొమ్ము ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details