ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసులా వేషం.. 70కి పైగా కేసుల్లో నిందితుడు - తూర్పు గోదావరి క్రైమ్ వార్తలు

అమాయకులను నమ్మించి మోసం చేయడమే అతడి పని. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి.. ఆపై.. లక్షలు దండుకుంటాడు. ఇన్సూరెన్స్ ఇప్పిస్తానని.. డబ్బులు వసూలు చేస్తాడు. ఉన్నత అధికారిలా నమ్మిస్తాడు. నమ్మితే ముంచేసి పోతాడు. అలా 70 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు ఓ వ్యక్తి.

పోలీసులా వేషం మార్చాడు.. కానీ 70కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు!
పోలీసులా వేషం మార్చాడు.. కానీ 70కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు!పోలీసులా వేషం మార్చాడు.. కానీ 70కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు!

By

Published : May 24, 2021, 5:47 PM IST

అనంతపురం జిల్లా వెలమద్దికి చెందిన రాచపల్లి శ్రీనివాస్ ప్రజలను మోసం చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అందుకోసం ఉన్నతాధికారిలా వేషాలు మారుస్తాడు. నమ్మిన వాళ్లను నిలువునా ముంచేస్తాడు. అసలు విషయంలోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన సత్యంద్ర అనే రైతు ఎద్దులు గతంలో విష ప్రభావంతో మృతి చెందాయి. విషయం తెలిసిన నిందితుడు శ్రీనివాస్.. తాను విజిలెన్స్ డీఎస్పీని అంటూ.. ఫోన్​లో రైతుతో పరిచయం చేసుకున్నాడు. ఇన్సూరెన్స్ కంపెనీ వారితో మృతి చెందిన ఎద్దులకు నలబై అయిదు లక్షలు ఇప్పిస్తానని నమ్మబలికాడు. రైతు నుంచి అయిదు లక్షల వరకూ వసూలు చేశాడు. అయితే కొన్ని రోజుల తర్వాత రైతుకు అనుమానం వచ్చి.. సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రైతు ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. నిన్న మధ్యాహ్నం విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న శ్రీనివాస్​ను ప్రత్తిపాడు వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే నిందితుడిపై వివిధ ప్రాంతాల్లో 70కి పైగా కేసులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బెంగళూరులోనూ పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. పలుమార్లు జైలుకి కూడా వెళ్లివచ్చినట్లు తెలిసింది.

అనంతపురం జిల్లా కదిరి పోలీస్ స్టేషన్​లో శ్రీనివాస్ జీప్​ డ్రైవర్​గా పనిచేసేవాడు. పోలీసులతో కలిసి పని చేయడం వల్ల పోలీస్ వేష భాషలపై ప్రావీణ్యం సంపాదించాడు. తర్వాత ఉద్యోగం మానేసి ఇలా నేరాలు చేయడం మెుదలుపెట్టి చివరకు పోలీసులకు చిక్కాడు.

ఇదీ చదవండి:హైవే కిల్లర్‌ మున్నా కేసులో సంచలన తీర్పు.. 'నైలాన్ తాడుతో గొంతులు కోసేవాడు'

ABOUT THE AUTHOR

...view details