తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట కోనేటి చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో నలుగురు యువకులు గాయపడ్డారు. కారు, ప్రైవేట్ బస్సు ఢీకొనటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. భద్రాచలానికి చెందిన నలుగురు యువకులు.. కాకినాడలో పని ముగించుకొని జగ్గంపేట వైపు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. కారు డ్రైవర్ కారులో ఇరుక్కుపోయాడు.. పోలీసులు గంట పాటు శ్రమించి బయటకు తీశారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.
కారు, బస్సు ఢీ.. నలుగురు యువకులకు గాయాలు - ఈరోజు రోడ్డు ప్రమాదం తాజా వార్తలు
కారు, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు యువకులు గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట కోనేటి చెరువు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్ను పోలీసులు గంటపాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీశారు.
కారు, బస్సు ఢీ నలుగురు యువకులకు గాయాలు