ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండపేటలో యువతిపై సామూహిక అత్యాచారం - మండపేట రేప్ కేసు

తూర్పుగోదావరి జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

four-persons-have-gang-raped-a-young-woman-in-mandapet
four-persons-have-gang-raped-a-young-woman-in-mandapet

By

Published : Mar 5, 2020, 5:17 AM IST

తూర్పుగోదావరి జిల్లా మండపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగు చూసింది. మంగళవారం సాయంత్రం ఓ యువతి తన స్నేహితుడు, తోటి విద్యార్థితో కలసి బైక్​పై వెళ్తుండగా... నలుగురు వ్యక్తులు వీరిని అడ్డగించారు. ఆమెను దూరంగా ఉన్న పొలాల్లోని మట్టి దిమ్మె వద్దకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అర్ధరాత్రి సమయంలో ఆమె బంధువులకు ఈ సమాచారం అందటంతో బాధితురాలిని తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మండపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం రాత్రి తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి మండపేట వచ్చి బాధితురాలను పరామర్శించారు. నిందితుల్ని ఉరి తీయాలని కుల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఘటనలో నిర్భయతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details