ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైజాగ్​లో మేము క్షేమంగా ఉన్నాం' - వైజాగ్​లో నలుగురు మత్స్యకారులు

నాలుగు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పాడైన ఇంజన్ మరమ్మతులు నిర్వహించుకుని వైజాగ్ చేరుకున్నట్లు తెలిపారు.

four fishermen  informed to family members that the they were safe.
తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు మత్స్యకారులు

By

Published : Aug 15, 2020, 11:57 AM IST

నాలుగు రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన నలుగురు మత్స్యకారులు క్షేమంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈనెల 10న తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడకు చెందిన వీరన్న ,సంజీవ్, దుర్గాప్రసాద్, అమీనాబాద్ కు చెందిన కాశయ్యలు బోటు పై సముద్రంలో వేటకు వెళ్లారు. బోటు ఇంజిన్ పాడవడంతో... వారు గల్లంతయ్యారు. దీంతో మూడు రోజులుగా వారికోసం గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. శుక్రవారం రాత్రి వారు వైజాగ్ సమీపంలో సురక్షితంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పాడైన ఇంజన్ మరమ్మతులు నిర్వహించుకుని వైజాగ్ చేరుకున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details