ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా విక్రయిస్తున్న నలుగురు అరెస్టు - అనంతపురం జిల్లా నేరాలు

రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ నిబంధనతో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. ఫలితంగా కొందరు అక్రమార్కులు నాటుసారా తయారీకి తెర లేపారు. తూర్పుగోదావరి జిల్లాలో నాటుసారా తయారీదారులపై పోలీసులు దాడులు చేసి .. విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.

Four arrested for selling Natusara in east godavari district
నాటుసారా విక్రయిస్తున్న నలుగురు అరెస్టు

By

Published : Apr 28, 2020, 9:07 PM IST

తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం, ఆత్రేయపురం మండల్లాలో నాటుసారా విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను రావులపాలెం పోలీసులు అరెస్టు చేశారు. నాటుసారా విక్రయిస్తూ పట్టుబడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రావులపాలెం సీఐ. కృష్ణ హెచ్చరించారు. ఆత్రేయపురం మండలం పులిదిండిలో 30 లీటర్ల సారా, ముగ్గురు వ్యక్తులను.. రావులపాలెం మండలం గోపాలపురంలో 20 లీటర్ల నాటుసారా, ఒక వ్యక్తిని అరెస్టు చేశామని ఆయన తెలిపారు. అరెస్టు చేసిన నిందితులను రిమాండ్​కు తరలించామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details