ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'స్మృతివనంలో అంబేడ్కర్ విగ్రహం మాయం మీ ఘనతే' - వైకాపా ప్రభుత్వంపై టీడీపీ విమర్శలు

సీఎం జగన్​కు చట్టాలు, కోర్టులపై గౌరవం లేదని తెదేపా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. వైకాపా అధికారం చేపట్టిన 15 నెలల్లో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. అమరావతి స్మృతివనంలో అంబేడ్కర్ విగ్రహాన్నే మాయం చేశారని విమర్శించారు. రాష్ట్రం నియంతృత్వ పాలనలో ఉందని జ్యోతుల నెహ్రూ ఆక్షేపించారు.

తెదేపా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
తెదేపా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

By

Published : Sep 18, 2020, 4:24 PM IST

రాష్ట్రం నియంత పాలనలో ఉందని తెదేపా మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ విమర్శలు గుప్పించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో మాట్లాడిన ఆయన… ముఖ్యమంత్రి జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్‌ పాలనలో రాష్ట్రం ఎటు పోతోందని ప్రశ్నించారు. సంస్కృతి, సంప్రదాయాలు, చట్టాలు, న్యాయస్థానాలను జగన్‌ గౌరవించరని నెహ్రూ అన్నారు.

అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలో అన్ని వర్గాల వారిని ఇబ్బందులు పెట్టడమే కాకుండా భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాన్ని కూడా అమరావతి స్మృతివనంలో కన్పించకుండా చేసిన ఘనత ఈ ప్రభుత్వానిదేనని జ్యోతుల నెహ్రూ విమర్శించారు.

ఇదీ చదవండి :కోర్టు రాజకీయ వేదిక కాదు... ఏఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details