ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 10, 2021, 7:46 PM IST

ETV Bharat / state

'పేదవారు, నిరక్ష్యరాస్యులు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు'

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా ప్రక్రియ నిర్వహణలో దారుణంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత హర్షకుమార్ ఆరోపించారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందరికీ సాధ్యం కావడం లేదని.. పేద వర్గాలు, నిరక్ష్యరాస్యులు స్మార్ట్ ఫోన్ ద్వారా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకుంటారని హర్షకుమార్ ప్రశ్నించారు.

మాట్లాడుతున్న మాజీ ఎంపీ హర్షకుమార్
మాట్లాడుతున్న మాజీ ఎంపీ హర్షకుమార్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా ప్రక్రియ నిర్వహణలో దారుణంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత హర్షకుమార్ ఆరోపించారు. ప్రైవేటు ద్వారా టీకా పొందేలా కుట్ర జరుగుతోందని అన్నారు. వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందరికీ సాధ్యం కావడం లేదని.. పేద వర్గాలు, నిరక్ష్యరాస్యులు స్మార్ట్ ఫోన్ ద్వారా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకుంటారని హర్షకుమార్ ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక విధానంవల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పారు. పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు అధికంగా పెరగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధరలు తగ్గించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details