వైకాపా ప్రభుత్వం తమ కుటుంబంపై అక్రమంగా కేసులు పెట్టి తమ పార్టీలో చేరాలని ఒత్తిడికి గురి చేస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ ఆరోపించారు. తన తండ్రిని వెంటనే విడుదల చేయాలంటూ మద్దతుదారులతో కలసి ఆయన నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడకు వెళ్లిన రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ... సంఘీభావం ప్రకటించారు. దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. హర్షకుమార్‌పై ఉన్న కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ శాసనసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశ పెడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
'పార్టీలోకి చేరాలని కేసులు పెట్టి ఒత్తిడి చేస్తున్నారు' - హర్షకుమార్ అరెస్టును ఖండిస్తూ దీక్ష చేసిన కుమారుడు శ్రీరాజ్
వైకాపా ప్రభుత్వం తమ కుటుంబంపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్ కుమారుడు శ్రీరాజ్ ఆరోపించారు. అక్రమంగా కేసులు పెట్టి తమ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తోందని అన్నారు.
హర్షకుమార్ అరెస్టును ఖండిస్తూ మద్దతుదారుల నిరసనదీక్ష