తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయంలో పిక్అప్, డ్రాపింగ్‌కు డబ్బులు వసూలు చేయడంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు శ్రీ రాజ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల వద్ద కొత్త తరహా వసూళ్లు ఎందుకు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ రాజ్‌కు అక్కడ ఉన్న మరికొంతమంది వ్యక్తులు మద్దతు తెలిపారు. ఓ సీఆర్పీఎఫ్ అధికారి వచ్చి... ఇలా వసూలు చేయడంపై వివరణ ఇవ్వాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇలాంటి వసూళ్లను ప్రోత్సహించొద్దని అక్కడి వారందరికీ చెప్పిన హర్ష కుమార్ కుమారుడు శ్రీ రాజ్.. వందకుపైగా కారులను ఉచితంగాలోనికి పంపించారు.
ఎయిర్‌పోర్టులో వసూళ్ల రగడ... సిబ్బందిని నిలదీసిన మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం విమానాశ్రయం సిబ్బందిపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు శ్రీ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయంలో పికప్, డ్రాపింగ్‌కు డబ్బులు వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. వాహనాలు పార్కింగ్ చేయకుండా ఎలా డబ్బులు వసూలు చేస్తారని మండిపడ్డారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయం సిబ్బందిపై మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు ఆగ్రహం
Last Updated : Jan 7, 2021, 3:27 PM IST