తూర్పు గోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రిలోని రోగులకు అందుతున్న సేవల గురించి మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి.. ప్రత్యక్షంగా పరిశీలించారు. చాలీచాలని భోజనం పెడుతున్నారని రోగులు చెప్పగా.. ఆమె మండిపడ్డారు. ఈ సమస్యను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో రోగులకు పాలు, రొట్టె, గుడ్డు అందించేవారని.. ప్రస్తుతం అవి అందడం లేదని ఆగ్రహించారు. ఈ విషయంపై తేదేపా ఆధ్వర్యంలో తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గంగవరం ఎంపీటీసీ అభ్యర్థి ఆదినారాయణను రాజేశ్వరి పరామర్శించారు. ఆమె వెంట పార్టీ సీనియర్ నాయకులు మెహర్ బాబా, రాయపల్లి చౌదరి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు.