నివర్ తుపాను సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని... కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపించారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి తుపానులో చిక్కుకుని మృతి చెందిన ఒమ్మడి సతీష్ కుటుంబాన్ని పరామర్శించారు. మత్స్యకారులు సముద్రంలో చిక్కుకున్నారన్న సమాచారం వచ్చినప్పటికీ... అధికారులు స్పందించలేదని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. ఫలితంగా తన సొంత ఖర్చుతో మృతదేహాన్ని తెచ్చమని గుర్తుచేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు.
'వైకాపా హయాంలో మత్స్యకారులకు రక్షణ లేదు' - news updates in kakinada
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మృతిచెందిన మత్స్యకారుడు సతీష్ కుటుంబాన్ని నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పరామర్శించారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జాలరులకు రక్షణ లేదని విమర్శించారు.
కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు