అమరావతి కోసం ఎంతోమంది రైతులు వేల ఎకరాల భూమిని త్యాగం చేశారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. రాష్ట్రాభివృద్ధిపై చంద్రబాబు ముద్రను చెరిపేయటం కోసమే మూడు రాజధానుల విధానాన్ని వైకాపా సర్కార్ అవలంబిస్తోందని ఆయన విమర్శించారు. అమరావతి రైతుల పోరాటానికి మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో తెదేపా శ్రేణులతో కలసి రామకృష్ణారెడ్డి ఆదివారం నిరసన ర్యాలీ చేపట్టారు.
చంద్రబాబుపై కక్షతోనే 3 రాజధానులు: రామకృష్ణ - amaravati protest news
చంద్రబాబుపై కక్షతోనే రాష్ట్ర ప్రభుత్వం 3 రాజధానులు విధానాన్ని అవలంబిస్తోందని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అమరావతి రైతులకు మద్దతుగా ఆయన బిక్కవోలులో నిరసన ర్యాలీ నిర్వహించారు.
amaravati
బిక్కవోలులోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. ఎన్టీఆర్, గాంధీ, పూలే, అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడని ఆయన.. వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. హైకోర్టు ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా... అదే నిరంకుశ వైఖరిని అవలంబించడం శోచనీయమన్నారు.