ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో సుబ్బయ్య అనే తెదేపా కార్యకర్త హత్యే... సీఎం జగన్ రాక్షస పాలనకు ఉదాహరణ అని రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. సుబ్బయ్య హత్యలో ప్రమేయం ఉన్న ఎమ్మెల్యే పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట మండలం ఇర్రిపాకలో తన స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించి పరిపాలన సాగించాలని సీఎం జగన్ చూస్తున్నారని ఆరోపించారు.
'ఆ ఎమ్మెల్యే పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి' - jyothula nehru updates
రాష్ట్రంలో సీఎం జగన్ అరాచక పాలన సాగిస్తున్నారని తెదేపా ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ విమర్శించారు. అందుకు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన కడపలో తెదేపా కార్యకర్త సుబ్బయ్య హత్యే సాక్ష్యం అన్నారు. సుబ్బయ్య హత్యలో ప్రమేయం ఉన్న ఎమ్మెల్యే పేరు కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని డిమాండ్ చేశారు.
తెదేపా ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ
TAGGED:
సీఎం జగన్పై నెహ్రూ విమర్శలు