ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇంటి వద్దే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి' - తూర్పుగోదావరి జిల్లా

ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలియజేశారు. తనలాగే అందరూ సామాజిక మాధ్యమాలు, చరవాణీల ద్వారా శుభాకాంక్షలు తెలపాలన్నారు.

former mla Jyothula nehru
మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

By

Published : Dec 29, 2020, 7:17 PM IST

ప్రజలు, కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత జ్యోతుల నెహ్రూ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ రెండోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటి వద్దే ఉండి కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని తాను నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో కాకినాడ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ ఇంటివద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.

అందరూ అదే విధంగా..

పండుగ తరువాత పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని నెహ్రూ నియోజకవర్గ కార్యకర్తలు, ప్రజలకు సూచించారు. స్నేహితులు, కుటుంబ సభ్యులకు అందరూ సోషల్ మీడియా, ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో మంతెన నీలాద్రిరాజు, మండల తెదేపా ప్రధాన కార్యదర్శి రేఖ బుల్లి రాజు, వెలిశెట్టి శ్రీను, బుర్రి సత్యనారాయణ, కోనేటి వెంకటేశ్వరరావు, బొడేట్ సుమన్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

కాకినాడలో తెదేపా కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details