కరోనా కష్టకాలంలో శివశక్తి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను చూసి ఓర్వలేక.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. శివశక్తి ఫౌండేషన్‌కు ఎన్ఆర్ఐల నుంచి నిధులు రావటం లేదని తాను కోటప్పకొండ సాక్షిగా ప్రమాణ చేస్తానని.. పేదల ఇళ్ల స్థలాల పంపిణీలో తక్కువ రేటుకు భూములు కొనుగోలు చేసి.. అధిక ధరకు ప్రభుత్వానికి విక్రయించలేదని అధికార పార్టీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని జీవీ సవాల్ విసిరారు.
ఎమ్మెల్యే బొల్లాకు.. మాజీ ఎమ్మెల్యే జీవీ సవాల్ - gv Anjaneyu updates
కరోనా కష్టకాలంలో పేదల ఆకలి తీరుస్తున్న శివశక్తి ఫౌండేషన్‌పై.. వినుకొండ వైకాపా ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ధైర్యం ఉంటే.. ఈ నెల 28న కోటప్పకొండపై ప్రమాణం చేసేందుకు రావాలని సవాల్ విసిరారు.
మాజీ ఎమ్మెల్యే జీవీ
శివశక్తి ఫౌండేషన్‌కు రూ.కోట్ల నిధులు వస్తున్నాయని.. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు రూ.వంద కోట్లు దోచుకున్నానని నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. నిరూపించకపోతే బొల్లా తన పదవికి రాజీనామా చేస్తారా? అని జీవీ సవాల్ విసిరారు.
ఇదీ చదవండి