ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రావెల్ లారీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే - గ్రావెల్ లారీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే

గ్రావెల్ తరలిస్తున్న లారీని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి అడ్డుకున్నారు. అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్​ను కోరామన్నారు.

former MLA blocked the gravel lorry
గ్రావెల్ లారీని అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే

By

Published : Apr 14, 2020, 3:06 AM IST

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామంలో గ్రావెల్ తరలిస్తున్న లారీని అనపర్తి మాజీఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అడ్డుకున్నారు. కరోనా భయంతో ప్రజలు ఉంటే అక్రమంగా మట్టిని వందలాది లారీలతో తరలిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సూర్యనారాయణ ఈ విషయంపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మట్టి తవ్వకాలపై రంగంపేట తహసీల్ధారు వై.జయకు సమాచారమిచ్చినట్టు రామకృష్ణా రెడ్డి తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details