తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోనకు చెందిన మాజీ మంత్రి మోకా విష్ణుప్రసాద రావు(90) కన్నుమూశారు. ఇటీవల అస్వస్థతతో అమలాపురం ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 18 ఏళ్ల పాటు కాట్రేనికోన సర్పంచ్‌గా పని చేశారు. 1972లో అల్లవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 1978లో రాష్ట్ర కేబినెట్లో మంత్రిగా పని చేశారు.
