తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేడ్కర్ జయంతి వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. ఇంద్రపాలెం జంక్షన్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుల నిర్మూలనకు పిలుపునిచ్చిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్ అని దళిత ఐక్య వేదిక నాయకుడు భద్రం మాస్టారు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
'కుల నిర్మూలనకు పిలుపునిచ్చిన మహోన్నత వ్యక్తి అంబేడ్కర్' - Former minister Mudragada Padmanabham latest news
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో అంబేడ్కర్ జయంతి వారోత్సవాల్లో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పాల్గొన్నారు. దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం