మాజీ మంత్రి కొప్పన మోహనరావు బుధవారం రాత్రి కన్నుమూశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన ఆయన బుధవారం తీవ్ర అస్వస్థతకు గురవడంతో కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాత్రికి ఆరోగ్యం విషమించడంతో కాకినాడ జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు సూపరింటెండెంట్ రాఘవేంద్రరావు నిర్ధారించారు.
మాజీ మంత్రి కొప్పన కన్నుమూత - koppana rammohan died
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన మాజీ మంత్రి కొప్పన మోహనరావు బుధవారం రాత్రి అస్వస్థతతో కన్నుమూశారు. కొప్పన 1978, 1989ల్లో రెండు పర్యాయాలు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
![మాజీ మంత్రి కొప్పన కన్నుమూత Former Minister Koppana mohan rao died](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8225571-805-8225571-1596070793233.jpg)
మాజీ మంత్రి కొప్పన కన్నుమూత
కొప్పన 1978, 1989ల్లో రెండు పర్యాయాలు కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కరరెడ్డి కేబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం వైకాపాలో కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి:విద్యా విధానంలో భారీ మార్పులు