ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదవి విరమణపై అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసిన రెడ్డి సుబ్రహ్మణ్యం - Former Legislative Council Deputy Chairman Reddy Subramaniam wrote a letter to the Assembly Secretary

తన పదవి కాలం ముగియక ముందే రిటైర్మెంట్ ప్రకటించటం అన్యాయమని మాజీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. దీనిని వ్యతిరేకిస్తూ.. అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిపారు.

Former Legislative Council Deputy Chairman Reddy Subramaniam
మాజీ శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం

By

Published : Jul 2, 2021, 12:07 PM IST

సీఈసీ ఆర్డర్​కు విరుద్ధంగా ముందుగానే తమ పదవిని విరమణ చేయించారని మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని స్వగృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం తమను ఇంకా ఎమ్మెల్సీగా కొనసాగించాలన్నారు. ఆగస్ట్​ 11 వరకు పదవి కొనసాగుతుందని ఎన్నికల సంఘం అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసినా.. ప్రభుత్వం పదవి విరమణ ప్రకటించటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ.. అసెంబ్లీ కార్యదర్శికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ విషయంపై న్యాయనిపుణులతో చర్చించి కోర్డును ఆశ్రయిస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా ప్రభుత్వాన్ని ఆదేశించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ABOUT THE AUTHOR

...view details