ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాం అసెంబ్లీ స్థానానికి పుదుచ్చేరి మాజీ సీఎం నామినేషన్ - Puducherry

యానాం అసెంబ్లీ స్థానానికి పుదుచ్చేరి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి నామినేషన్ వేశారు. రాజ్యాంగ విలువలను కాపాడుతానని ప్రమాణం చేశారు.

Former cm rangaswamy nomination for Yanam Assembly
యానాం అసెంబ్లీ స్థానానికి మాజీ ముఖ్యమంత్రి రంగస్వామి నామినేషన్

By

Published : Mar 17, 2021, 6:06 PM IST

పుదుచ్చేరి రాష్ట్రంలోని యానాం అసెంబ్లీ స్థానానికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత రంగస్వామి నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి అమన్ శర్మకు నామపత్రాలు సమర్పించారు. ప్రతి పని ప్రారంభంలో శుభగడియలు చూసుకునే ఈయన... సరిగ్గా మధ్యాహ్నం 1:45 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు..సెంటిమెంట్​గా ద్విచక్రవాహనంపై రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి తీసుకెళ్లారు. రాజ్యాంగ విలువలు కాపాడుతానని ప్రమాణం చేశారు.

యానాం అసెంబ్లీ స్థానానికి ఇవాళ నాలుగో రోజు ఈయనతోపాటు ఇండిపెండెంట్​ అభ్యర్థి నాటి బూరియ్య నామినేషన్ దాఖలు చేశారని.. ఇప్పటివరకు ఆరు నామినేషన్లు వచ్చినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details