ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CBI Former JD: కౌలు రైతుల కష్టాలు తెలుసుకునేందుకే సాగు చేస్తున్నా: లక్ష్మీనారాయణ - వ్యవసాయం చేస్తున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

రైతన్న పండించిన పంటలతో మనం ప్రశాంతంగా జీవిస్తుంటే.. రైతు మాత్రం అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారని సీబీఐ పూర్వపు  జేడీ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల కష్టనష్టాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనే ఆలోచనతోనే 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నానన్నారు.

Former CBI Jedi Lakshminarayana doing farming
కౌలు రైతుల కష్టాలు తెలుసుకునేందుకే వ్యవసాయం చేస్తున్నా

By

Published : Jun 24, 2021, 5:32 PM IST

కౌలు రైతుల కష్టాలు తెలుసుకునేందుకే వ్యవసాయం చేస్తున్నా

కౌలు రైతుల కష్టనష్టాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనే ఆలోచనతోనే వ్యవసాయం చేస్తున్నానని సీబీఐ పూర్వపు జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఈరోజు ఏరువాక సాగించనినట్లు వెల్లండించారు. రైతులతో కలిసి ఏరువాక సాగిన అనంతరం స్థానిక రైతులను లక్ష్మీనారాయణ సత్కరించారు.

రైతు నిత్య శ్రామికుడని.. కరోనా లాంటి కష్ట సమయంలోనూ విరామం లేకుండా పని చేసే వ్యక్తే రైతు అని కొనియాడారు. రైతన్న పండించిన పంటలతో మనం ప్రశాంతంగా జీవిస్తుంటే.. రైతు మాత్రం అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భాగస్వామ్యంతో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ పరిస్థితులు అధ్యయనం చేయాలేనే ఆలోచనతో ఉన్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details