ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ గ్రామంలో వన సమారాధన... కులమతాలకు అతీతం - తూర్పుగోదావరి జిల్లా వనమహోత్సవం తాజా సమాచారం

కార్తీకమాసం ప్రారంభమైందంటే... జోరుగా వన సమారాధనలు జరుగుతుంటాయి. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కులాల వారీగా విడిపోయి వన సమారాధన జరుపుకుంటారు. కాని తూర్పుగోదావరి జిల్లా రవీంద్రపురం ప్రజలు కులమతాలకు అతీతంగా ఊరంతా ఒక్కటై జరుపుకుంటారు.

ఆ గ్రామ వనసమారాధన... కులమతాలకు అతీతం

By

Published : Nov 24, 2019, 11:55 PM IST

ఆ గ్రామంలో వన సమారాధన... కులమతాలకు అతీతం


తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం రవీంద్రపురంలోని ప్రజలు... కార్తీక వన సమారాధనను కులాల వారీగా కాకుండా... ఊరంతా ఒక్కటై జరుపుకుంటారు. 700 కుటుంబాలు, 1500 జనాభా ఉన్న ఈ గ్రామంలో సుమారు 15 వరకు కులాలు ఉన్నాయి. కానీ ప్రతి ఏడాది కార్తీక మాసంలో ఈ గ్రామస్థులు అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. గత 20 ఏళ్లుగా గ్రామస్థులందరూ వారికి తోచినంత నగదు వేసుకొని పొలాలకు వెళ్లి శివుడిని పూజిస్తారు. వన సమారాధన వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా ఇదే తరహాలో వన సమారాధన నిర్వహించుకున్నారు. చిన్నారుల నృత్యాలు, యువకుల ఆటపాటలు, పెద్దల కబుర్లు, ముచ్చట్లతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఆనందంగా గడిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details