తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో గుర్తుతెలియని అడవి జంతువు లేగదూడలపై దాడి చేయడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. ఆలమూరు మండలం జొన్నాడ, పెనికేరు, నవాబుపేట గ్రామాల్లోని పశువుల పాకల్లో ఉంటున్న లేగదూడలపై కొన్ని రోజులుగా గుర్తుతెలియని అడవి జంతువు దాడి చేస్తోందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
లేగదూడలపై అడవి జంతువు దాడి
తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలంలో గుర్తుతెలియని అడవి జంతువు లేగదూడలపై దాడి చేసి తింటుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకుని తమ జంతువులను కాపాడాలని కోరుతున్నారు.
ప్రతిరోజు ఏదో ఒక పశువులపాకలో ఈ సంఘటనలు జరుగుతుండడంతో పాడి రైతులు భయాందోళనకు గురవుతున్నారు. పెనికేరు, నవాబుపేట, జొన్నాడ ఈ ప్రాంతాల మధ్యలోనే రాత్రి వేళల్లో సంచరిస్తుందని రైతులు తెలిపారు. సమాచారం అందుకున్న పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు రామకృష్ణ, మండల పశువైద్యాధికారి జి.భానుప్రసాద్, అటవీ శాఖ అధికారులు లేగదూడ మృతి చెందిన ప్రాంతానికి చేరుకొని పరిశీలించారు. దాడులకు పాల్పడుతున్న జంతువును పట్టుకునేందుకు చర్యలు చేపడతామని అటవీశాఖ అధికారి పట్టాభి తెలిపారు.
ఇదీ చూడండికొవిడ్ సోకడం నేరం కాదు...వైరస్ ఎవరికైనా వ్యాపిస్తుంది'