గోదావరి బోటు ప్రమాదంలో ఇంకా ఆచూకీ లభించని వారి కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద బంధువులు పడిగాపులు పడుతున్నారు. వరంగల్ అర్భన్ జిల్లా కడిపికొండ నుంచి వచ్చిన 14మంది పర్యాటకుల్లో ఐదుగురు బతికారు. 6 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ముగ్గురి కోసం ఎదురుచూస్తున్నారు. హైదరాబాద్, విశాఖ, నర్సాపురం, పోలవరం తదితర ప్రాంతాలకు చెందినవారు ఆసుపత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. మృతదేహాలకు సంబంధించి ఏదైనా సమాచారం తెలుస్తుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇందులో కొంతమంది రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ను కలిసి తమవారి ఆచూకీ తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రి వద్ద ఎదురు చూడొద్దని... ఆచూకీ తెలియగానే తెలియజేస్తామని సబ్‌కలెక్టర్ వారికి హామీ ఇచ్చారు.
బోటు ప్రమాదంలో ఆచూకీ లభించని వారి కోసం ఎదురుచూపులు
గోదావరి బోటు ప్రమాదంలో ఇంకా ఆచూకీ లభించని వారి కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి వద్ద బంధువులు పడిగాపులు కాస్తున్నారు.
గోదావరి బోటు ప్రమాదంలో ఆచూకీ లభించని వారి కోసం...ఎదురుచూపులు