ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

godavari: ఎరుపెక్కిన గోదారి..మీసాల రొయ్య! - పోలవరం నిర్వాసితులు వార్తలు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నీలం రంగుల్లో ఉన్న నది ఒక్కసారిగా ఎరుపెక్కింది. తూర్పుగోదావరి జిల్లాలోని పోలవరం నిర్వాసితులు నివాసముండే గ్రామాలు నీటమునిగాయి..వారు కొండలపై తలదాచుకున్నారు.

food flow at godavari river
ఎరుపెక్కిన గోదారి

By

Published : Jul 15, 2021, 8:56 AM IST

గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీరు నదిలోకి చేరుతోంది. మంగళవారం వరకూ నీలం రంగులో ఉన్న గోదావరి నీరు బుధవారం ఎరుపు వర్ణం సంతరించుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం రోడ్డు, రైలు వంతెన వద్ద గోదావరి నీరు రంగు మారడంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు.

వలకు చిక్కిందయ్యా ఈ రొయ్య!

సాధారణంగా సముద్రపు రొయ్య సుమారు 250 గ్రాముల బరువు ఉంటుంది. కానీ తూర్పుగోదావరి జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ చేపలరేవులో ఓ మత్స్యకారుడి వలకు బుధవారం కిలో బరువున్న రొయ్య చిక్కింది. పెద్ద మీసాలతో ఆకర్షణగా ఉన్న దీన్ని ఓ వ్యాపారి రూ.600కు కొనుగోలు చేశారు. ఈ జాతికి చెందిన రొయ్యలు చాలా అరుదుగా లభిస్తాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

గండిపోశమ్మ ఆలయాన్ని చుట్టుముట్టిన గోదావరి

గోదావరి నదిపై పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాం కారణంగా వెనుక భాగంలో వరద ముంపు గ్రామాలను ఆందోళనకు గురిచేస్తోంది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పెరిగిన వరద మధ్యాహ్నం నిలకడగా కనిపించింది. సాయంత్రానికి స్పలంగా తగ్గినా.. పోశమ్మగండి వద్ద అమ్మవారి ఆలయంతో పాటు 40 ఇళ్లలోకి వరద చేరింది. బాధితులంతా సామగ్రితో పురుషోత్తపట్నం, సీతానగరం వైపు వెళ్లారు. అమ్మవారి ఆలయం చుట్టూ, మండపంలోకి పూర్తిగా నీరు చేరింది. దేవీపట్నంలోని కారంమిల్లు జంక్షన్‌ వద్ద ఆర్‌అండ్‌బీ రహదారిపై వరద చేరింది. గోకవరం నుంచి పోశమ్మగండి వైపు వెళ్లే మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచాయి. తూర్పుగోదావరి జిల్లా కె.వీరవరం గ్రామాన్ని వరద నీరు క్రమంగా చుట్టుముట్టడంతో గిరిజనులు కొండలపైకి వెళ్తున్నారు.

ఇదీ చూడండి.POLAVARAM PROJECT: గోదారి వరద... పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే నుంచి నీటి విడుదల

ABOUT THE AUTHOR

...view details