తూర్పుగోదావరి జిల్లాలో లాక్‌డౌన్ ప్రభావంతో రాకపోకలు స్తంభించాయి. ఎలాంటి ఆధారం లేని నిరుపేదలు, యాచకులకు భోజన వసతులు కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. జిల్లా కలెక్టర్ అనుమతి మేరకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ప్రధాన కూడళ్లు, వీధుల్లో తిరిగి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆహారాన్ని అందిస్తున్నారు. నగరంలో ఆకలి తీర్చే రథంతో పాటు హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్మీ, చేయూత ట్రస్ట్, ఇతర సంస్థలు ఆహార పంపిణీ చేపట్టాయి.
అభాగ్యులకు అండగా స్వచ్ఛంద సంస్థలు - తూర్పుగోదావరిలో యాచకులకు భోజన వసతులు
తూర్పుగోదావరి జిల్లాలో నిరుపేదలకు, యాచకులకు భోజన వసతులు కల్పించేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చాయి. వివిధ సంస్థల ప్రతినిధులు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆహారాన్ని అందిస్తున్నారు.

నిరుపేదలు, యాచకులకు భోజన వసతులు కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు
నిరుపేదలు, యాచకులకు భోజన వసతులు కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలు