తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై జనసేన నాయకులు, కార్యకర్తలు.. వలస కూలీలకు అన్నదానం చేశారు.
పులిహోర, బిస్కెట్లు, అంబలి, మజ్జిగ, మంచినీరు, రస్కులు అందజేశారు. అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ తమ్మయ్యబాబు తెలిపారు.