తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం చెక్ పోస్టు వద్ద రహదారిపై వెళ్తున్న వలస కూలీలకు సత్యసాయి సేవా సంస్థ వారు ఆహారం పంపిణీ చేశారు. నడిచి తమ స్వగ్రామాలకు వెళ్తున్న వారికి బిస్కెట్ ప్యాకెట్లు, జామకాయలు అందజేశారు. బస్సులు, లారీల్లో వెళ్తున్న వారికీ అవి పంపిణీ చేశారు.
వలస కార్మికులకు బిస్కెట్ ప్యాకెట్లు, జామకాయలు పంపిణీ - రావులపాలెంలో వలస కూలీలకు సత్యసాయి సంస్థ సహాయం వార్తలు
ఇతర ప్రాంతాల్లో పని కోసం వెళ్లిన వలస కూలీలు లాక్ డౌన్ కారణంగా స్వస్థలాలకు వెళుతూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. వారికి పలు స్వచ్ఛంద సేవా సంస్థలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నాయి.
![వలస కార్మికులకు బిస్కెట్ ప్యాకెట్లు, జామకాయలు పంపిణీ food distribute to migrant labours in raavulapalem east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7353997-572-7353997-1590490140041.jpg)
వలస కార్మికులకు బిస్కెట్ ప్యాకెట్లు, జామకాయలు పంపిణీ