ఇదీ చదవండి..
తూర్పు మన్యాన్ని కప్పేసిన.. మంచు దుప్పటి - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలోని మన్యం ప్రాంతంలో పొగమంచు కనువిందు చేసింది. మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారి, భద్రాచలం వెళ్లే మార్గం, జలాశయాలు, జలపాతాల వద్ద దట్టమైన మంచు కమ్ముకుంది. ఉదయాన్నే ఆయా ప్రాంతాల నుంచి ఏజెన్సీకి వచ్చే సందర్శకులు కొండలపై కమ్ముకున్న మంచును చూసి ఆహ్లాదంగా గడిపారు. మంచుతో ఏర్పడిన అందాలను తిలకించారు. ఆ సుందర దృశ్యాలను సెల్ఫోన్లలో బందించారు. మరోవైపు పొగమంచు కారణంగా వేకువజామున వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
తూర్పు మన్యంలో పొగమంచు కనువిందు