ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మంచు కురిసే.. మనసు మురిసే..

వెలుగుని దట్టమైన మంచు చుట్టేస్తుంటే.. ఆ చల్లని పొగ మంచుని చీల్చుకుంటూ.. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య నుంచి లేలేత సూర్య కిరణాలు పడుతుంటే.. భలే ఉంటుంది కదూ..! కోనసీమలో ఉన్న ఆ స్వచ్ఛమైన ప్రకృతి అందాలని మీరూ చూడండి మరీ..

By

Published : Jan 9, 2020, 2:11 PM IST

fog in konaseema in east godavari district
కోనసీమలో మంచు అందాలు

కోనసీమలో మంచు అందాలు

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో పొగమంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. పొద్దుపోయే సరికి చలి పులిలా వెన్నులో వణుకు పుట్టిస్తుంటే.. తెల్లవారుజామున కురిసే మంచు అందాలు కనువిందు చేస్తున్నాయి. శీతాకాలం ప్రారంభం నుంచి ఎన్నడూలేని విధంగా గురువారం తెల్లవారుజాము నుంచి విపరీతంగా మంచు కురుస్తోంది. రహదారులను మంచుతెరతో కమ్మేశాయి. ప్రయాణాలు చేసేవారు తమ వాహనాలకు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళ్తున్నారు. పొద్దు పొద్దున్నే పక్షుల రాగాలు, చెట్లకు వికసించే పువ్వులపై కురుస్తున్న మంచు అందాలను చూస్తూ రైతులు పంట పొలాలకు వెళ్తున్నారు. కొబ్బరి చెట్ల మధ్య నుంచి పొగమంచు చీల్చుకొని బయటకు వస్తున్న సూర్యుడిని, కొబ్బరి చెట్లపై కురుస్తున్న పొగమంచు అందాలను.. కోనసీమ వాసులు ఆనందంతో తిలకిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details