లాక్‌డౌన్ వల్ల ఎగుమతులన్నీ నిలిచిపోవటంతో పూలు పండించే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కడియం పరిసరాల్లో అధిక శాతం పూలు పండిస్తారు. పెళ్లిళ్ల సీజన్ కావటం వల్ల.. వేసవిలో పూలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ కావటం వల్ల రవాణా లేక పూలన్నీ పొలాల్లోనే రాలిపోతున్నాయి. కళ్లఎదురుగా పంట పోతున్నా ఏమీ చేయలేని రైతుల పరిస్థితిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అందిస్తారు.
లాక్‌డౌన్ తో నష్టపోతున్న పూలసాగుదారులు
లాక్‌డౌన్ వల్ల పూలసాగుదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. రవాణా లేక రైతులు పూలు అమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పొలాల్లోనే పూలు నేలరాలుతున్నాయి. మంచి సీజన్‌లో లాక్‌డౌన్ వల్ల నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
flowers